పథేర్‌ పాంచాలీ, వనవాసి నవలల ద్వారా బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ అభిమానులైన తెలుగు పాఠకులకు మరొక కానుక ఈ చంద్రగిరి శిఖరం (చందేర్‌ పహార్‌). ప్రకృతి చిత్రణలోనూ, జీవన తాత్వికతలోనూ ఈ రచయితకున్న విలక్షణమైన దృక్పథానికి చక్కటి ప్రతిబింబం ఈ నవల.
భాషకుడూ, సాహసికుడూ అయిన ఒక బెంగాలీ యువకుడు ఆఫ్రికన్‌ అరణ్యాల్లో చేసిన సాహస యాత్రను వర్ణించిన నవల ఇది. ఐతే, కేవలం కాలక్షేపాన్ని అందించే సాహసగాథల వంటింది కాదు ఈ రచన. విస్తృతమైన జీవితానుభవాలూ, ప్రకృతితో సాన్నిహిత్యమూ మానవ స్వభావాన్ని ఎంత ఉన్నతీకరిస్తాయో అతి సున్నితంగా చిత్రించాడు రచయిత.
ఆఫ్రికన్‌ అరణ్యాల్లోని ప్రమాదభరిత వాతావరణాన్నీ, ప్రకృతి సౌందర్యాన్నీ కళ్ళకు కట్టినట్టుగా వర్ణించిన ఈ రచేన పాఠకులను ముగ్ధుల్ని చేస్తుంది. బిభూతి భూషణుడి రచనలతో తెలుగు పాఠకుల అనుబంధాన్ని ఈ నవల మరింతగా బలపరుస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good