వాక్యమంటే రారా చిన్నన్నా...రారోరి చిన్నవాడ..అని ముద్దుగా అన్నమయ్య వేణుగోపాలుణ్ణి పిలిచినంత మార్దవంగా ఉండాలి. నీలం రంగు నిప్పు, పువ్వయి ప్రకాశించాలి. సర్వమూ తానే అయిన వాడిలా వాడిగా లాలించి పాలించాలి. వానవిల్లు మీద నడిచి మేఘాలలో తేలినట్టుండాలి. కాలిగ్రఫీ చిత్రాల్లా కళ్ళకు కట్టాలి. కందర్ప హేతువై ఘనదూమకేతువై చుట్టుముట్టాలి. యూనిఫామేసుకుని అప్పుడే స్కూలుకొచ్చిన పిల్లలు ప్రభాత వేళ ప్రార్ధన సమయంలో లైనుకట్టి నిల్చున్నట్టుండాలి. అప్పుడప్పుడూ భావాలు ఎర్రకోట ముందు సైనికుల్లా కవాతుచెయ్యాలి. మాటలు ఈటెలూ, కత్తులూ. అవే చురుక్కుమనిపించే చమక్కులు. మనసుల్ని ముడివేసే మంత్రాలు.''

అరుణపప్పు తొలి కథా సంకలనం ఇది. ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ చదివినా పాత్రికేయం అంటే ఇష్టంతో దాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. ఐదేళ్ళు 'ఈనాడు'లో పనిచేసి, గడిచిన ఐదేళ్ళుగా 'ఆంధ్రజ్యోతి'లో ఫీచర్స్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు.

చదువొక వ్యసనం. అక్షరం కనిపించడమే ఆలస్యం చదువుతుంటాను. మంచి వచనానికి, కవితాత్మకమైన పంక్తులకూ త్వరగా ఆకర్షితమవుతాను' అంటారామె.

Write a review

Note: HTML is not translated!
Bad           Good