చాణక్యుడు రచించిన గ్రంథాలలో చాణక్యనీతి శాస్త్రాలు ఒకటి. ఈ గ్రంథంలో ఎనిమిది అధ్యాయాలుగా ఉన్నది. అందులో మొత్తం 562 సూత్రాలు ఉన్నాయి. ''సుఖస్యమూలం ధర్మ: ధర్మం సుఖానికి మూలం అనే సూత్రం నుంచి తస్మాత్‌ సర్వేషాంసర్వకార్యసిద్ధిర్భవతి (తపస్సు వల్ల అందరికి కొన్ని కార్యాలు సిద్ధిస్తాయి) అనే సూత్రంతో ఈ గ్రంథం ముగుస్తుంది. దీనికి విఖ్యాత పండితులు శ్రీ పుల్లెల రామచంద్రుడుగారు చాలా నందిని అనే వ్యాఖ్యను సమకూర్చి పదుగురికి అందుబాటులోనికి తీసుకొని వచ్చారు. దేశంలో ప్రతి పౌరుని యోగక్షేమాలకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన రాజ్యపాలనా సంవిధానం చాణక్యుని అర్థశాస్త్రాదులలో మనకు కన్పిస్తుంది. చాణక్యుడు రాజనీతిసూత్రాణి అనే పేరుతో ఎనిమిది అధ్యాయాలలో 562 సూత్రాలతో ఈ గ్రంథాన్ని కూర్చాడు వీటిలో చెప్పిన అంశాలలో కనీసం నూటికి ఎనభై అంశాల పరిపాలకులకు, పరిపాలకులకు ఈనాటికీ వర్తిస్తాయి, ఉపకరిస్తాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good