పిల్లలు కథల ద్వారా దేన్నయినా సులభంగా నేర్చుకోగలరు. ఎంత సంక్లిష్టమైన అంశాన్నైనా కథ రూపంలో చెబితే ఆసక్తితో వింటారు. వినడమే కాదు, దానిని మరో నలుగురికి చెబుతారు. కథల్ని ప్రసారం చేయడంలో పిల్లలెప్పుడూ ముందుంటారు.

కథలు చెప్పేవారు తగ్గిపోతున్న నేటి దశలో కథలు వినే వారి సంఖ్య పెరుగుతోందని పరిశోధనలు తెలుపుతున్నాయి. కథలు వినాలంటే చెప్పేవారు కావాలి. అందుకొరకు పాఠశాలలో 'స్టోరీ టెల్లింగ్‌ టీచర్స్‌' అని కొత్త వృత్తి ఏర్పడుతోంది. అదేవిధంగా సైన్స్‌ను కథల రూపంలో చెప్పడానికి జరిపిన ప్రయత్నమే ఈ 'చైనారాణికి పట్టు చీర' పుస్తకం.

ఇందులో తేనెటీగల జీవనం, పాములు పగబట్టుతాయా, లాక్టోమీటర్‌, కాంతి పరావర్తనం, ఫారంకోడి గ్రుడ్డు నుంచి పిల్ల వస్తుందా, ఆహారపు గొలుసు, పూల వృత్తాంతం, పట్టు పెంపకం, విత్తనాలు మొలకెత్తడం, జన్యుమార్పిడి విత్తనాలు వంటి అనేక భావనలు కథల రూపంలో చక్కగా అమరినాయి. పిల్లలకే కాకుండా పెద్దలు కూడా తెలుసుకోదగిన అంశాలను కథలుగా రచయిత మలిచాడు.

'ప్రతి ఇంట్లో, పాఠశాలల్లోనూ ఉంచదగిన' సైన్స్‌ కథల పుస్తకం ఈ 'చైనారాణికి పట్టుచీర'

Pages : 47

Write a review

Note: HTML is not translated!
Bad           Good