చాలా ఏళ్లనుంచి చలసాని ప్రసాదును ఎరుగుదును. ఎప్పటి నుంచో రాస్తున్నాడు, ఉపన్యాసాలు ఇస్తున్నాడు, పాఠాలు చెపుతున్నాడు. మూడున్నర దశాబ్దాల సాహిత్య చరిత్రకు ఇదొక విలువైన రికార్డు... ఈతరం విమర్శకులూ, రచయితలూ పారాయణం చెయ్యదగిన వ్యాస సంపుటి.... - చేకూరి రామారావు

    చలసాని ప్రసాద్‌ అజాత శత్రువు. ఆయన మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తాడో అంతగా ప్రేమించే స్నేహితులు ఆయనకున్నారు. ఆయన పుస్తకాలను ఎంతగా ప్రేమిస్తాడో మనుషుల్ని అంతకన్న ప్రేమిస్తాడు. ఆయనకు ఎంత పెద్ద లైబ్రరీ ఉన్నదో అంతకన్న పెద్ద స్నేహ ప్రపంచం ఉన్నది. బహుశా జీవితకాలంలో ఈ రెండు ప్రపంచాలలో తేలియాడే ఆనందాన్ని అనుభవించడానికే అనుకుంటాను, తన తర్వాత మిగిలే రచన మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. - వరవరరావు

    విప్లవ రచయితల సంఘం సంస్థాపక సభ్యుడుగా 'విరసం ప్రసాద్‌', శ్రీశ్రీ సమగ్ర సాహిత్యం 20 సంపుటాల సంపాదకుడుగా 'శ్రీశ్రీ ప్రసాద్‌'గా పేరు పొందిన చలసాని ప్రసాద్‌ గత నాలుగు దశాబ్దాలుగా విరివిగా రచనలు చేసినప్పటికీ, పుస్తక రూపంలో వెలువడుతున్న మొదటి వ్యాస సంపుటం ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good