''కవిత్వమంటే నాకు విపరీతమైన ఆసక్తి. సమీక్షలు, వ్యాసాలు కొన్ని రాశాను. అనువాదాలు కూడా కొన్ని చేశాను. సాహిత్యాన్ని చరిత్రపరంగా, సామాజికపరంగా, రాజకీయ ఉద్యమపరంగా విశ్లేషించాలని నా అభిలాష.'' - చలసాని ప్రసాద్‌

    ''ప్రపంచం, సమాజం మనకు చాలా మంది మహత్తర వ్యక్తులను ప్రసాదించింది. వారు వాళ్ళ ముద్రల్ని అలా తోటి వారి మీద, సందర్భాల మీద, ఘటనల మీద వదిలి వెళ్ళిపోతారు. మనుషులు, పచ్చికుండల్లా పగిలిపోతున్న సమయంలో చలసాని ప్రసాద్‌ లాంటి మనుషుల మధ్య బతకటం, స్నేహించటం, చరించటం, సృజించటం గొప్ప ఆనందం. ఒక గొప్ప ఆశ, గొప్ప పోరాట ఉత్సాహం, ఎల్లలు లేని ఆత్మీయత ఎక్కడ దొరుకుతాయి - చలసాని ప్రసాద్‌ లాంటి వాళ్ళ దగ్గర కాకపోతే... - శివారెడ్డి

    1932లో పుట్టి 1937 తొలి జనరల్‌ ఎన్నికల సంరంభంలో రాజకీయాలలోకి కళ్ళు తెరచి, హైస్కూల్‌ దశలోనే ఎర్రజెండా చేతబట్టి ఆరు దశాబ్దాలకు పైగా తెలుగునాట ప్రజా ఉద్యమాలతో కొనసాగుతున్న చలసాని ప్రసాద్‌ కవిత్వం, వ్యాసాలు, వ్యక్తి పరిచయాలు, ముందుమాటలు, ఇంటర్వ్యూలు కలగలిపిన సంకలనం ఇది. 2008లో వెలువడిన 'చలసాని ప్రసాద్‌ సాహిత్య వ్యాసాల'కు ఇది కొనసాగింపు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good