‘‘స్వేచ్ఛని ప్రేమించే మనిషికి ఎన్ని బంధనాలు!

గట్లులేంఇ స్వేచ్ఛలేదు.

శృతిలేంది సంగీతంలేదు.

దేనికి స్వేచ్ఛ ` దేనికీకాని స్వేచ్ఛ మహాభారం.

ఇచ్ఛకీ స్వేచ్ఛకీ చాలా దూరం.

పోతున్నాను, పోతున్నాను.

రోడ్ల మీది వెన్నెలని తొక్కుకుంటో,

సైడుకాలవల నీడల్ని చూసుకుంటో

వెన్నెలని చీల్చుకుంటో, నీడని తప్పించుకుంటో.

దిగులు ` రావడం తప్పు ` తప్పు అన్నాయి

చుట్టూ ఆగిన రైలు పెట్టెలు

నా విసురు నడకతో

తప్పు తప్పు అన్నాయి. ఇళ్ళలో చీకట్లు, రగిలే నా దీపాలతో.

నీతో ప్రేమ దోబూచి.

అప్పుడే వొచ్చింది, చీకట్లో నీ దగ్గరికి.

నిద్రపోయ్యెవాళ్ళ కళ్ళల్లో కారం కొట్లాలని, మర్యాద నిలపాలని,

తనవంశపు కీర్తిని పోషించాలని నటించింది.

వొచ్చింది నీకోసం కళ్ళతో కాళ్ళతో వెతుకుతూ వొచ్చింది. నీ

అవిశ్వాసానికి ఏడుస్తోంది. నువ్వు పడుకున్నచోట, నీ వుత్త పక్కమీద

కన్నీళ్ళు, శ్యామల వేడి కన్నీటి చుక్కలు.

మోహంలేని దేహాన్ని ప్రేమలేని హృదయాన్ని,

అంగీకరించని నా ఏపూర్వుల రక్తమో ` చెలం సెక్సువేదాంతమో ` 

అభ్యంతరాలు ` అసహ్యాలు ` ఆలింగనాలు...’’

అన్నీ... ఇందులో...

పేజీలు : 

Write a review

Note: HTML is not translated!
Bad           Good