కథకి గొప్పతనం పట్టాలంటే, కథ చిత్రించే జీవితం భూమి నుండి పైకి లేవాలి. అన్ని గొప్ప కథలూ, గ్రంథాలూ అంతే, ఇలియడ్‌ చూడండి. ఓ పిల్ల కోసం గుంటూరు జిల్లా అంత లేని రెండు దేశాలు కొట్టుకున్నాయి. కాని కవి చేతుల్లో అవి దేవాసుర యుద్ధాల్ని మించాయి.

నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వం పట్టిందో చూడండి. కాకపోతే అవి వుత్త ప్రబంధ కథలయ్యేవి. మానవ తత్వాన్నే నిరూపిస్తే నేను, ఏ నాలుగు కథలో రాయగలను. కాని కథని పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టామా, ఒక్క స్వర్గాన్నే అనంతంగా అనేక విధాల ఆలపించగలం.

చలం కథల్లో విలన్‌ సంఘం, కమ్యూనిస్టుల కథల్లో విలన్‌ కాపిటలిజం, కాని యీనాటి రచయితల కథల్లో విలన్‌ లేడు. హీరోయే విలన్‌, అందుకని ఏ ఆశా లేదు. సంఘం మారవొచ్చు. ఆర్థిక విధానం ` మారవొచ్చు. కాని మానవుడు మారతాడనే ఆశలేదు ` ఈ కథల్లో ....

పేజీలు : 363

Write a review

Note: HTML is not translated!
Bad           Good