స్త్రీనై, పురుషుణై, బీదనై, భాగ్యశాలినై రాబోయే జన్మలో జన్మలో యిదికావాలి, అది సాధిద్ధామనికోరి మృత్యువుతో మంతనాలాడి జీవిత సుఖాల్ని మరిగి, ప్రతిసారి సుఖ బాధల కొత్త కొత్త వాసనలతో బరువెక్కి మూలిగేవాణ్ణి, శరీర భౌతికానుభవాలకి అలవాటుపడి, వాటినుంచి వెగటుతోచి, ఎగరలేక ఏడుస్తో పడిపోయేవాణ్ని. పుటకకి, చావుకి మధ్య కాలంలో ఎక్కడో దూరంగా కన్న కలలబలంతో ఏదో తెలియని అందాలకై అన్వేషించి, అలసిపడి పోయేవాణ్ని, అట్లాగే ఒక జన్మ ఇంకొక జన్మకి మధ్య ఒకసారి.
పేజీలు : 264c