అతను కుటుంబ బాధ్యతల్లో తలమునకలయిన వ్యక్తి - ఆనందమయమయిన జీవితానికై అపురూపమయిన కలల్ని మనస్సులో పేర్చుకుంటున్నా - జీవితం ఒక పెద్ద సవాలు అయి అతనిముందు నిలిచింది. దాని నుంచి తప్పించుకొనే మార్గం లేదు -

ఆమె ఆగర్భ శ్రీమంతురాలు. బాధ్యతలు, బాదరబందీ లేకుండా స్వచ్చమయిన గులాబి పువ్వులాగ ఈ లోకంలో కన్ను విప్పింది. మమతా మాధుర్యాలను కురిపించగల ఆత్మీయుల నీడల్లో అల్లారుముద్దుగా పెరిగింది -

అతని తల్లి సనాతన సంప్రదాయల నుండి వేరుపడలేక అదే ప్రపంచమని నమ్మిన పాతకాలపు మనిషి -

ఆమె తండ్రి ఆధునిక ప్రపంచానికి ప్రతినిధి. మారే ప్రపంచానికి మారుతున్న కాలానికి అతని జీవితం సజీవ నిదర్శనం -

ఈ పాత కొత్తల మేలుకలయికగా, వారి ఇద్దరి జీవితాలూ ముడిపడ్డాయి. వారి ప్రేమానురాగాల విశ్వరూపమే - చక్రనేమి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good