'తల్లీ నన్ను క్షమించు. నా అజ్ఞానం కారణంగా నా వంశానికి నువ్వు పెట్టిన శాపాన్ని ఉపసంహరించు. నా బిడ్డల్ని కాపాడు' గద్గద స్వరంలో అంటున్న మామ్మమాటలు మాత్రం వినిపించాయి.
అవతలి నుంచి ఎటువంటి సమాధానం వచ్చిందో అతనికి తెలియదు. ఏం జరిగిందో అంతకన్నా తెలియదు. భగ్గుమని మంట ఒకటి పిచ్చిమామ్మ నిలబడిన ప్రదేశంలో ప్రత్యక్షమయింది.
చూడటానికి ట్రై చేస్తుండగానే అది మటుమాయం అయిపోయింది. మంటతో పాటు మామ్మకూడా కనిపించకపోయేసరికి  డగ్గుత్తికపడింది పాండుకి. 'మామ్మా మామ్మా' అంటూ పిలుస్తున్న అతని చుబుకాన్ని ఆప్యాయంగా పట్టుకుంది ఒక అమృతహస్తం.
'శక్తిరాయుడు సృష్టించిన కారణంగా మీ వంశానికి అధిదేవతనయ్యాను. అనాలోచితంగా మీరు బాధలుపడటానికి కూడా నేను బాధ్యురాలిని అయ్యాను. ఇకనుంచీ మీకు ఎటువంటి కష్టమూరాదు.
నీ పిచ్చిమామ్మ ఈ బతుకునుండి విముక్తి పొందింది. పెళ్ళిళ్ళు చేసుకుని మీరు పిల్లా పాపలతో హాయిగా జీవించండి' దారుణమైన ఆ వెలుగులో నుంచి లీలగా అతని చెవులకు చేరాయి ఆ మాటలు.
ఎప్పుడు వచ్చాడోగాని పాండు వెనుకనుంచి మాట్లాడాడు రవిబాబు. 'తల్లీ, ఇంకో ముఖ్యమైన విషయం. తనుకూడా మా వంశానికి చెందినవాడేనని తెలిసికూడా ఇంతవరకూ మాకు చెప్పకుండా మా మధ్య తిరిగిన పాండును నువ్వు క్షమించద్దు. నన్ను క్షమించు. నాకు కాబోయే భార్యకి మేనత్త అయిన సువర్ణ ఎక్కడుందో చెప్పి పుణ్యం కట్టుకో. సువర్ణ జాడ తెలియకపోతే మా పెళ్ళి జరగదు''.
'మీకు ఎటువంటి ఇబ్బందులూ రావు. నీవు కాబోయే భార్యకు మేనత్త సువర్ణకు విముక్తి లభించింది' అంటూ వినవచ్చాయి మాటలు. గదిలోవున్న వెలుగంతా కుంచించుకుపోయి, పూజ సామాగ్రి మధ్యనవున్న అష్టసిద్ధి యంత్రంలో ఐక్యమైపోయింది. అది రివ్వున గాలిలోకి లేచి కొండలమ్మ తల్లి గట్టువైపు దూసుకుపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మధుబాబు గారు రాసిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'చక్రతీర్ధం' నవల చదవాల్సిందే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good