నిజానికి పరీక్షలంటే కొందరిలో భయం ఏర్పడడానికి అసలు కారణం - వారు తమ పైనల్ ఎగ్జామ్ కోసం సరిగా ప్రిపేరు కాకపోవడమే. ఇలాంటి వారికి మొదటి నుంచి చదివే అలవాటు సరిగా వుండదు. చదువు పై అట్లే ఆసక్తి, శ్రద్ధ కనబరచారు. తీరా పరీక్షలు దగ్గరపడుతున్న కొద్ది అప్పుడు పుస్తకాల దుమ్ము దులుపుతారు. ఆ సమయంలో పేజీలు  తిరగేస్తే అందులో వున్నా విషయం మైండ్ కెక్కాదు సరికదా అదో పెద్ద గుదిబండలా అనిపిస్తుంది. అలాంటి వారి ముఖంలో నవ్వు మాయమై అప్రసన్నత చోటు చోటుచేసుకుంటుంది. సబ్జెక్టు ఏమిటో తెలియక ఎలా చదవాలో ఏం చదవాలో అర్ధంకాక క్వశ్చన్ మార్కు ముఖంలో కనబడతారు. ఈ పుస్తకంలో పరీక్షలు వెళ్ళేటటు వంటి విద్యార్ధులకు వారికి అవసరమయ్యే కాన్సన్ ట్రేషన్ మెమరీ స్కిల్స్ పరీక్షలలో వచ్చేటటువంటి భయాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టికల్ గా ఈ పుస్తకంలో వివరించబడింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good