గౌరవాన్విత వర్తక కుటుంబానికి చెందిన చారుదత్తుడు సురసుందరియైన వేశ్య వసంతతిలకపట్ల అనురక్తుడై తన వంశకీర్తి వీథులపాలవుతూ నిర్గతికుడౌతాడు.  సాధ్విపత్ని హృదయవైశాల్యం కలిగి వుండటం వల్ల కూడా వసంతతిలకను భార్యగా స్వీకరిస్తాడు.  శ్రమ, సాహసం, నిష్ఠలతో దేశవిదేశాలు సంచారం చేసి, మరలా వణిక శ్రేష్ఠుడు కావడం అనే కథలపందిరి మనోజ్ఞంగా అల్లడం జరిగింది.  ఊహించని మలుపుల్ని తనలోన ఆకళించుకొంటూ, కథ కుతూహలాన్ని రేకెత్తిస్తూ సాగుతుంది.
ఇది రాజు-రాణుల కావ్యం కాదు.  యుద్ధముఖి కథనమూ కాదు.  మానవస్వభావంలోని విన్యాసాల పొరల్లో ప్రకటితమవుతూ, మతాతీతంగా , మ¬న్నతమానవీయ విలువలతో కూడిన జనముఖంగానూ, సమాజముఖంగానూ సాగిన కావ్యమిది.  ఈ అమర ప్రేమ ఆఖ్యానం వ్యవహార భాషకి చేరువగా ఒక విధమైన లయతో వెలువడిన కావ్యం ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good