Rs.130.00
In Stock
-
+
కేలండర్ను గురించి ఈ గ్రంథం సంక్షిప్తంగా వివరిస్తుంది. కేలండర్ అవసరం, దాని నిర్మాణ పద్ధతి, అందులోని లోపాలు, వాటి దిద్దుబాట్లు, ఇంకా జరగవలసిన మార్పులు వగైరా పంచాంగపు (కేలండర్) బాల్య, యౌవనాది వివిధావస్థలందు దిజ్మాత్రంగా వివరిస్తుంది.
మానవ జాతి నిర్మించుకున్న వైజ్ఞానిక సోపానపథంలోని తొలిమెట్లలో కేలండర్ ఒకటి. మానవ అవసరం కోసం మొదలై, మతంతో ముడిపడి, పంచాంగాలు ఎన్నెన్ని హొయలు పోయాయె, ఎన్నెన్ని మార్పులు చెంది ఈనాటి స్థితికి వచ్చిందో తెలియజేస్తుంది.
ఈజిప్టు, బామబిలోనియా, గ్రీసు, ఇండియా, చైనా, మెక్సికో దేశాలలో వర్థిల్లిన బహు పురాతన పంచాంగాలను గురించి, వాటి నుంచి ప్రస్తుతం మనమంతా వాడుకుంటున్న కేలండర్ ఎలా తయారైందో సోదాహరణంగా వివరిస్తుంది. ఈ కేలండర్ కథ.
పేజీలు : 160