తనకి స్వేచ్ఛనిమ్మని చాలా గోల చేస్తున్నాడు. ఆకాశంవంకా, చెట్లవంకా, ఎగిరే పక్షులవంకా కాంక్షతో చూస్తున్నాడు. బంధంలోవున్న పక్షుల ఆరాటం చూసినప్పుడు అర్థమౌతోంది. ఆకాశంలో యెండలో యెగరడం. ఆకుల నీడల్లో కుచోవడం పక్షులకి యెంత ఆనందమో!
ఇంక అతను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడనీ, నిలిపి వుంచడం క్రూరమనీ, అపాయంలోకి వెళ్ళినా అతని స్వేచ్ఛ అతనిదనీ డిస్కస్ చేసుకున్నారు.
ఆషా, లతా రేడియోలో పాడుతూవుంటే తనూ వాళ్ళతో కలిసి పాడుతునÊఆనడు. రికార్డు అయిపోగానే తనూ ఆగుతాడు. ఇవాళ్ళ షికారు వెళ్ళేముందు. అతను తప్పించుకొని షౌ భుజంమీద వాలి, అక్కడ నించి గోడమీదికి యెగిరాడు. పకపకకి చిక్కాడు చివరికి
సాయంత్రం షికారు వెడుతోవుంటే అతను నర్తకి వెనకనే నడుస్తున్నాడు. బాటసారులు అతన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు. సరదాపడి అతని సంగతులు తెలుసుకుంటున్నారు. వాళ్ళలో వాళ్ళు నిలిచి మాట్లాడుకుంటున్నారు. ఒకరు మైనాపిల్లని తెచ్చిపెడతామన్నారు.
కొండమీదికి వెళ్ళారు. ఎండకి గుంటలో నీళ్ళెండిపోయినాయి. తను ఆ రోజు స్నానం చేసిన ఆ గుంటచూసి నీళ్ళకోసం వెతుక్కున్నాడు. కురంగేశ్శర్, జగన్నాధం కొండ దిగివెళ్ళి మంటపంలో కూలివాళ్ళని బతిమాలి కుండెడు నీళ్ళు కొండపైకి మోసుకొచ్చి గుంట నింపారు. అతను స్నానం చేశాడు. ఇవాళ ‘‘ఫ్లై ప్రాక్టీస్’’లో బాగా యోగిరాడు. దూరంగా యెత్తుగా యెగిరిపైన కూచున్నాడు.
పేజీలు : 96