రాహుల్‌ సాంకృత్యాయన్‌ రచనల్లో ''బుద్ధుడు-గాంధీ'' వ్యాసాన్ని ఒక చారిత్రక పత్రం (Historical Document)గా పరిగణించాలి. ఎందుకంటే ఈ దేశంలో కొన్ని శక్తులు గాంధీజీని ప్రగతి నిరోధి (reactionary) గా చిత్రిస్తున్నాయి. ఈ దాడిని, విమర్శను ఎదుర్కొని గాంధీజీని నిజమైన విప్లవకారుడి (revolutionary)గా నిలబెట్టాలంటే రాహుల్‌ సాంకృత్యాయన్‌ రాసిన వ్యాసం ఎంతో విలువైంది. ఆయన అంతర్జాతీయ  స్థాయిలో భారతీయ సంస్కృతి నిజమైన ప్రతినిధిగా బుద్ధుడ్ని నిలబెట్టాడు. అటువంటి బుద్ధుడితో రాహుల్జీ చరిత్రలో ఇద్దరు మహనీయుల్ని పోల్చాడు. ఆ ఇద్దరు-కారల్‌మార్క్స్‌, మహాత్మాగాంధీ. బుద్ధుడి తర్వాత భారతదేశంలో అంతటి మహనీయుడు ఎవరైనా జన్మించాడంటే ఆయన గాంధీజీయేనని రాహుల్‌ సాంకృత్యాయన్‌ నిశ్చితాభిప్రాయం.

దేశానికి రాజకీయ స్వాతంత్య్రం తెచ్చిన గాంధీజీ ఆ విషయంతోనే తృప్తిపడేట్టు కనిపించటం లేదు. ఆయన భారత ప్రజల ఆర్థిక స్వాతంత్య్రం గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఆయన భారతదేశ ప్రజలను ఆర్థిక బానిసత్వం నుండి కూడా విముక్తి చేయగలిగితే చరిత్రలో ఆయన బుద్ధుడ్ని కూడా మించిపోతాడని రాహుల్జీ ఈ వ్యాసంలో ఆశించాడు. ఆ కల నెరవేరకముందే మహాత్ముడు మనల్ని వదిలివెళ్ళిపోయాడు. ఆ విధంగా ఆయన చరిత్రలో ''బుద్ధుడ్ని అధిగమించే'' పాత్ర నిర్వహించలేక పోయినా ''మానవీయ వారసత్వ'' రూపకల్పనలో బుద్ధుడితో సమానంగా ఆధునిక భారతదేశ చరిత్రలో నిలిచిపోయాడు గాంధీజీ. - టి.రవిచంద్‌

పేజీలు : 21

Write a review

Note: HTML is not translated!
Bad           Good