అహింసా సిద్ధాంతంతో, 'పంచశీల' ప్రవచనంతో ఆసియా వాసులకే కాక అనంత విశ్వానికీ, అనంత కాలాలకు అమృత సందేశం అందించిన తథాగతుని థర్మం ఒక్కటే ఈ అణ్వస్త్రయుగంలో అఖిల ప్రపంచవాసులకు అమృత భిక్ష అంటే అతిశయోక్తి కాదు. కపిలవస్తులో కన్ను తెరచి, కుసీ నగరంలో కన్ను మూసిన ఆ కరుణామూర్తి అవతార పరిసమాప్తి అయి నేటికీ రెండువేల ఐదువందల సంవత్సరాలు పైబడినా నేటికీ ఆయన మూర్తి మూగపోలేదు. వాణఙకి వన్నె తగ్గలేదు. కోటానుకోట్ల కాయన ఇప్పటికీ తెన్ను చూపుతూనే ఉన్నారు. మిన్నువాక కంటే మిన్నగా ఆయనలోని కారుణ్య సింధువు అనంత జీవిత క్షేత్రాలలో ప్రవహించి బంగారం పండిస్తున్నది. అనంతకోటి మానవ హృదయాలపై అధికారాన్ని ప్రతిష్టాపింప జేసుకొన్న ధర్మసామ్రాజ్యనికే అధినేత ఆయన....

Write a review

Note: HTML is not translated!
Bad           Good