సుమారు తొంభైఏండ్ల క్రితం ఆంగ్లంలో Some sayings of Buddha translated by F.L. Woodward పేరున ఒక సంకలనగ్రంథం (compilation) ప్రచురితమయ్యింది. ఈ ఆంగ్లగ్రంథాన్ని నమూనాగా మాత్రమే తీసుకొని బుద్ధవచనం పేరున ఆయా అంశాలను పాళీమూలనుండి తెలుగులోకి అనువదింపబడిన పుస్తకమిది. అనువాదం చాలా వరకు యథాతథమే. కొన్ని చోట్ల సంక్షిప్తం చేసి చెప్పడం, కొన్ని చోట్ల భావానువాదం చేయడం, కొన్ని చోట్ల అట్ఠకథల (commentaries) అంశాలను జోడించి చెప్పడం - ఇలా ఈ గ్రంథం ఒక ఆకృతిని పొందినది. మహాసతిపట్ఠానసుత్తాన్ని, ప్రతీత్యసముత్పాదం సుత్తాలను అనువదించలేదు. వాటి స్థానంలో ఆయా పేర్లతో రెండు వ్యాసాలను ప్రక్కప్రక్కనే ఇందులో చేర్చడం జరిగింది. ఆంగ్లగ్రంథంలోని మరి కొన్ని ఇతర అంశాలను కూడ ఈ పుస్తకానికి తీసుకొనలేదు. అలా వదిలివేసిన అంశాలు దర్మదీపం వెలువరించిన మహాపరిత్తంలో ఉన్నాయి. సల్లసుత్తం, ధనియసుత్తం పదేండ్లనాటి జయమంగళంలో వచ్చినప్పటికీ ఆ రెండు సుత్తాలను మళ్ళి కొత్తగా మెరుగ్గా అనువదించి ఇందులో చేర్చడం జరిగింది. ఈ బుద్ధవచనం పుస్తకంలో శీర్షికలు వందకు మించి ఉన్నాయి. వైదేహిక, తాలపుటుడు, సంగారవుడు, న్యగ్రోధుడు, చూళమాలుక్యపుత్రుడు, పుక్కుసాతి, వక్కలి, శోణుడు ఇంకా మరికొందరు జ్ఞాపకంలో నిలిచిపొయే వ్యక్తులు ఈ శీర్షికల్లో తారసపడతారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good