ఈ రచన యొక్క మూలము ' A Pictorial Biography of Sakyamuni Buddha' అను గ్రంథము. ఇది మొదట థాయి భాషలో రచింపబడి పిదప ప్రపంచ వ్యాప్తంగ అన్ని ప్రధాన భాషలలో అనువదింపబడి గొప్పగా ప్రజాదరణ పొందింది. దీనిని 'బొమ్మలలో శాక్యముని బుద్ధుని చరిత్ర' అను పేరుతో ఆంగ్లము నుండి తెలుగులో నేను అనువదించాను. కాని యీ అనువాదము ద్విపద రూపంలో వుంటే ఎంతో చక్కగాను, పాఠకుల హృదయాలను హత్తుకొనే విధంగా వుంటుందని నాకు తోచింది. దాని పర్యవసానమే యీ గ్రంథం.
క్రీ.పూ. 3వ శతాబ్దం నుండి మన రాష్ట్రంలో బౌద్ధం విరివిగా వ్యాపించియుండేది. జన బాహుళ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. నేడు అది మరుగైనా గూడ బుద్ధుని పేరు మాత్రం ఇంటింటా పరిచయమే.
ఆసక్తికరమైన ఆయన జీవితం, ఓర్పు, అహింసలపైన ఆధారపడిన ఆయన బోధనల గురించి యీ పుస్తకం తెలియజేస్తుంది. సామాన్య ప్రజానీకం అర్థం చేసుకొనగల సులభ శైలిలోను, జానపద గానమునకు గూడ అనువైన విధంగా ఇది రచింపబడింది. దీనివలన నేటి కల్లోలిత ప్రపంచంలో శాంతి చేకూరే మార్గం విదితమవుతుందని ఆశిస్తున్నాను.
- మేడం నారాయణరెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good