బుద్ధుడు, ధమ్మం, సంఘంలోని అంశాలు చాలా ఆసక్తికరంగా ఉండడమేకాక ఈ పుస్తకానికి చారిత్రక ప్రాధాన్యం కూడా చాలా ఉంది. ఈ పుస్తకం ప్రచురింపబడిన కాలంలో భారతీయ భాషల్లో బౌద్ధసాహిత్యం దాదాపు లేదనే చెప్పాలి. ఆ రోజుల్లో పాళీ భాష నేర్చుకోవడానికి, పుస్తకాలుగానీ, పాళీ నిఘంటువులుగానీ లేవు. అలాంటి క్లిష్ట పరిస్థితులల్లో కూడా బౌద్ధ విజ్ఞానాన్ని సముచితమైన నేపథ్యంతోపాటు పాఠకుల ముందుంచడం నిజంగానే శ్రమతో, సాహసంతో కూడిన ఒక చారిత్రక మహత్కార్యమే.
ఈ రచన బుద్ధుడు, ధమ్మం, సంఘం నేటికి వంద సంవత్సరాల పూర్వం వెలువడింది. దీని మొదటి ముద్రణ 1910లోను, రెండొవ ముద్రణ 1924లోను, మూడవ ముద్రణ ధర్మానంద కోసంబీ స్మారనిధి ద్వారా 1974లోను వెలువడ్డాయి. అయినా దీని తెలుగు అనువాదం ఇంతవరకు పాఠకులకు అందుబాటులోకి రాలేదు. మునుపు వీరి 'భగవాన్ బుద్ధ'కు శ్రీ బొర్రా గోవర్థన్ చేసిన తెలుగు అనువాదం ప్రచురించాము. కోసంబీ ఇతర రచనలు కూడా తెలుగు పాఠకులకు అందుబాటులో లేవు. ఈ కొరతను కొంతవరకైనా తీర్చే ప్రయత్నంలో భాగమే మా ఈ ప్రచురణ. పాఠకులకు ఈ రచన బౌద్ధధర్మం గురించి స్పష్టమైన అవగాహన కలిగించి, తెలుగునాట ఇప్పుడు జరుగుతున్న బౌద్ధధర్మ పునరుజ్జీవనానికి తోడ్పడుతుందని నమ్ముతున్నాం.
- అధ్యక్షులు, ధర్మదీపం ఫౌండేషన్

Write a review

Note: HTML is not translated!
Bad           Good