ఇవే ఎందుకు జ్ఞాపకముండాలి.  మిగతావి ఎందుకు లేవు. వ్యక్తిని రూపొందించడంలో అవి ఎంతవరకు ప్రధానమైనవి?  మన శాస్త్రజ్ఞులు మొదటి నాలుగైదేండ్లలోనూ వ్యక్తి యేర్పడి పోతాడు . అంటే ఎదిగిన వ్యక్తి నైతిక స్వరూపం తాలూకు పునాదులు యేర్పడుతాయని అంటారు.  నిజానికి మొదటి నాలుగైదేండ్ల జీవితంలో ఒక్క విషయం కూడా నాకు జ్ఞాపకం లేదు.  ఐదవయేట నుండి పదిహేనవయేట వరకూ, కొన్ని బాగా జ్ఞాపకం వున్నాయి.  తెరమీద సినిమా చిత్రాన్ని చూసినంత స్పష్టంగా వున్నాయి కొన్ని.  మరికొన్ని లేవు.  ఆ వున్న వాటికీ తరువాత వ్యక్తికీ ఎలాంటి సంబంధం వుందో చూడాలంటే వ్రాస్తేకానీ తెలవదు.

ఈ గ్రంథం బుచ్చిబాబు 'అంతరంగ కథనం' ఆత్మకథ అనేది చాలా మంది వ్రాయగలరు.  అంతరంగ కథనం బహు కొద్దిమందే వ్రాయగలరు - బుచ్చిబాబుకంటే 'జీనియస్సులు''.  బుచ్చిబాబు మనల్ని వదిలేసి వెళ్ళాక ఇది అచ్చు అయింది. ఇవాళ వచ్చింది.

''మానవునికి జీవితంతో సమాధానపడుట తప్పదేమో''  అనే సందేహం, సంకేతం వీరి కథారచనలలో ధ్వనిస్తుంది.  వీరి వ్యాసాలలో జ్ఞానతృష్ణ, వివేచన కనిపిస్తుంటుంది.  నాటకాలలో నాటక రచనా పాటవం ప్రస్ఫూటమౌతుంది. - కృష్ణశాస్త్రి

 

Write a review

Note: HTML is not translated!
Bad           Good