Rs.50.00
Out Of Stock
-
+
బౌద్ధ సాహిత్యంలో అనేక గ్రంథాలు ఆంగ్ల, తెలుగు భాషలో వచ్చినప్పటికిని వాటిలో భావపరిష్టత కొరకు పాలీ పదాల వాడుక తప్పడంలేదు. అంతేకాకుండా బౌద్ధజీవన విధానంలో నిత్యం పఠించే త్రిరత్నాలు, బుద్ధవందన, ధమ్మవందన, సంఘవందన, బుద్ధపూజ, పంచశీలాల ఉచ్ఛరణ ప్రపంచవ్యాప్తంగా పాలీ భాషలోనే కొనసాగుతుంది. ఆ పదాల వివరణ కొరకు ఉపాసకులు, ఉపాసికలు మదన పడుతుంటారు. వారి అభిలాషకు అనుగుణంగా గౌరవనీయులు శ్రీ అన్నపరెడ్డి బుద్ధఘోషుడు గారు మహా బౌద్ధవిజ్ఞానసర్వస్వ నిఘంటువును కూర్చి వాడుకలోకి తెచ్చారు. అది బౌద్ధంను నిత్యం పఠించేవారికి, పరిశోధించే వారికి, అనువాదకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తదుపరి బౌద్ధ పాఠకుల సందేహాల నివృత్తి కలిగించేందుకు 'బౌద్ధ పారిభాషిక పద నిఘంటువు'ను కూడా కూర్చారు.
పేజీలు : 116