పరిశీలించకుండా ఏ విషయాన్నీ గుడ్డిగా అనుసరించవద్దు. మత గ్రంథంలో రాసి వుందని గానీ, పెద్ద గురువు చెప్పాడని గానీ, తాత ముత్తాతల నుండి పాటిస్తున్నారని గానీ, సంప్రదాయికంగా వస్తుందని గానీ, మంత్రులు-అధికారులు-ధనవంతులు-పండితులు ఆచరిస్తున్నారని గానీ, ఆ వ్యక్తి చాలా కళాత్మకంగా చెప్పాడని గానీ, నువ్వు కృతజ్ఞత చూపించ వలసిన వ్యక్తి చెప్పాడనీ గానీ, నీకు కృతజ్ఞుడైన వ్యక్తి విన్నవించాడని గానీ, ఎక్కువ మంది పాటిస్తున్నారని గానీ లేక నీ అంతట నీవు ఊహించుకుని గానీ దేనినీ గుడ్డిగా విశ్వసించవద్దు. దానిని నీ అనుభవం అనే గీటురాయిపై పరీక్షించి చూడు. అది సర్వులకూ హితాన్ని-సుఖాన్ని కలిగిస్తుందో లేదోపరిశీలించు. తగు యోగ్యమైనదని తేలితే స్వీకరించు. లేకుంటే అవతల పెట్టు. - కాలామసుత్తం

Write a review

Note: HTML is not translated!
Bad           Good