మానవాళిలో అధిక జనాభాగల బౌద్ధ ప్రపంచంలో వెనరబుల్ డా. కె. శ్రీ ధమ్మానందగారి పేరు తెలియని బౌద్ధులెవరూ ఉండరు. ఆయన పేరు బౌద్ధులకు సుపరిచయం. వీరు అనేక బౌద్ధ సాహిత్య గ్రంథాలను రచించి ఆ తథాగతుడు చూపించిన విముక్తి మార్గాన్ని లెక్కలేనంత మందికి వీరి రచనల ద్వారా అందజేస్తున్నారు.
ఆయన ప్రసంగాల్ని స్వయంగా విన్నవారినే గాక దేశ విదేశాలలో ఉన్న అసంఖ్యాక ప్రజానీకం దగ్గరకు వీరి సందేశాన్ని అందించి వారి హృదయాల్ని కూడా ఆకట్టుకోగలుగుతున్నారు.
ఇంగ్లీషు భాషలో వారు రాసిన ఈ చిన్న పుస్తకాన్ని సులభశైలిలో గ్రామీణ ప్రజలకు సైతం అర్థమయ్యేటట్లు తెలుగు భాషలోకి అనువాదం చెయ్యాలనేది నా లక్ష్యం.
- ధర్మప్రియ దొమ్మేటి సత్యనారాయణబోధి

Write a review

Note: HTML is not translated!
Bad           Good