ఎండన పడి వచ్చిన వారికి చన్నీటి స్నానం ఎంత హాయినీ, ఆనందాన్ని ఇస్తుందో, వాదవివాదాలూ, సిద్ధాంత రాద్ధాంతాలతో తల బొప్పికట్టినవారికి బౌద్దధమ్మం కూడా అంతకుమించిన ఆనందాన్నే ఇస్తుంది.

ఈ సద్దమ్మ సెలయేటి స్నానంలో మనోమాలిన్యాలన్నీ కొట్టుకుపోతాయి.

మనసు పరిమళిస్తుంది.

మానవీయత గుబాళిస్తుంది.

మనస్సు ఇలా ధర్మ పరిమళాలు వెదజల్లడానికి కావలసిన ధర్మజలం ఈ పుస్తకంలోని ప్రతి సందేశంలోనూ ఉంది.

ఈ ప్రపంచాన్ని మానవీయ వర్షంలో తడిపిన తొలి తొలకరి బౌద్ధం. బుద్ధుడు తన జీవితకాలంలో ప్రబోధించిన ధర్మప్రవచనాలు కోకొల్లలు. ఆ తర్వాత ఎందరో ప్రవక్తలు బుద్దుడు చెప్పిన ధమ్మ ప్రబోధాల్నే తమ సందేశాలుగా చెప్పుకుని బ్రతికారు. ఇలా బ్రతికిన వారు ఈ దేశంలోనే కాదు. ఇతర దేశాల్లోనూ ఉన్నారు.

ఇతర ధర్మాల్లోనూ ఉన్నారు.

బుద్ధుని తర్వాత అంతో ఇంతో బౌద్ధధమ్మ ప్రభావం పడని వారిని చూడలేం. ఆ విషయం ఈ పుస్తకం చదివితే మీకే అర్థమవుతుంది. - బొర్రా గోవర్ధన్‌

Pages : 95

Write a review

Note: HTML is not translated!
Bad           Good