బౌద్ధ యుగం - మల్లంపల్లి సోమశేఖర శర్మ
సర్వమానవ సంక్షేమం కోసం, మానవాళిని దు:ఖవిముక్తులను చేయడం కోసం రాజ్యాన్ని, రాజభోగాలను, సంసారసుఖాలను తృణప్రాయంగా త్యజించి, త్యాగం అంటే ఎలా వుండాలో చూపిన ఆచరణశీలి బుద్ధుడు. తాను ఏది గ్రహించాడో దానిని బోధించాడు. ఏది బోధించాడో దానినే ఆచరించాడు. బుద్ధుని నుండి వెలువడిన ధర్మ తేజస్సు జగత్తును ఇప్పటికీ చకచ్చకితం చేస్తున్నది.
శ్రీమల్లంపల్లి సోమశేఖర శర్మ అజాతశత్రువు. బహువిలోకి. మహర్షి సమానులు. సత్యాన్వేషి, చారిత్రక పరిశోధనను అసిధారావ్రతంగా నిర్వహించారు. స్వయంప్రతిభ వలన ఉన్నతిని సాధించారు. ఆంధ్రత్వం ముమ్మూర్తులా రూపుకట్టినవారు. శర్మగారు రచించిన బౌద్ధ సంబంధ వ్యాసాలసంకలనమే బౌద్ధయుగము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good