విజయనగర రాజ్యపాలకుల లందరిలోకి ఖ్యాతి గడించిన చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు. సాహితీ సమరాంగణ చక్రవర్తి , కర్ణాటాంద్ర సమన్వయ నిత్యవిస్పూర్తి రాయల వారని ప్రసంస లందుకున్నారు.  వీరు కవి మాత్రమె కాక కళాపిపాసి , కవి పండిత పోషకులు , తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తించి  పోషించిన శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్ర భోజ బిరుదాంకితులు.
తాను రచించిన ఆముక్తమాల్యద గ్రంధంలోని ఒక పద్యంలో దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రశంసిం చారు నేటికి ఈ వాకం తెలుగు నాట ప్రతినోట వినిపిస్తుంది. శ్రీకృష్ణ దేవరాయలు పాలించిన కాలం స్వర్ణ యుగంగాను విజయ నగరం భూలోక స్వర్గంలా భాసిల్లింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good