ఇటలీ లో  వైద్య విద్యను అభ్యసించి మొదటి మహిళా డాక్టరు గా మరియా మాంటిస్సొరి ప్రపంచ ప్రసిద్ది చెందారు. ఆమె మహిళల హక్కుల కోసం పోరాడారు. మానసిక వికలాంగులు, మందబుద్ది చిన్నారులతో ఆమెకు సాన్నిహిత్యం పెరిగింది. అటువంటి పిల్లల కోసం రొం నగరంలో ఒక పాఠాశాలను స్తాపించారు. ఆ తరువాత చిన్నారులు కోసం కాసా -డి -బాంభిని అనే శిశు  గృహం ప్రారంభించారు. తొలుత డాక్టర్ అయిన మాంటిస్సొరి ఈ పద్దతుల్లో పెనుమార్పులు తెచ్చి చిన్నారులకు నేర్పించారు . ఈ పద్దతులు నేడు  మాంటిస్సొరి విధానం గా ప్రపంచ వ్యప్తంగా ప్రసిద్ది చెందాయి.  అమెరియా , స్పెయిన్ హాలాండ్ , ఇండియా ఇత్యాది అనేక దేశాలను ఆమె సందర్శించి మాంటిస్సొరి విధానాలు చిన్నారులను ఎలా చైతన్య వంతం చేస్తయన్నేది తన ఉపస్యాసాల ద్వారా తెలియ జేశారు. ఈమె రూపొందించిన పద్దతులపై అనేక పుస్తకాలు రాశారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good