శ్రీ శ్రీ అనేవి రెండు పొడి అక్షరాలూ కావు. ఒక మహా కవి పేరు. వారే శ్రీరంగం శ్రీనివాస రావు. వీరు తెలుగు సాహిత్యంలో సంప్రదాయ కవి, అభ్యుదయ కవి,విప్లవ కవి సినిమా కవి, నాటక కర్త. కథకుడు. 20 వ శతాబ్దంమంతా విస్తరించిన యుగకర్త. " ఈ శతాబ్ది నాది" అనగలిగిన దిమంతుడు. విదేశాలలో సైతం తెలుగు బావుటా ఎగరేసిన మహాకవి. పండితులను, యువతను తన కవితా ఒరాడితో ఆకట్టుకున్న గొప్ప కవి. గురజాడ అడుగుజాడల్లో నడిచి, మనకు జాడ చూపిన మార్గదర్శి. తెలుగు వారందరికీ ఇష్టమైనమైన కవి. ఒక తెలుగు వెలుగు. ఇంతటి మహాకవి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. |