ఆంధ్ర భోజునిగా పేరుగాంచిన శ్రీకృష్ణ దేవరాయల వారి ఆస్తానంలో అష్ట దిగ్గజ కవులలో ఒకరు మాదయగారి మల్లన. అష్టదిగ్గజ కవులు అనగా ఎనిమిది మంది కవులు అని అర్ధం. మల్లన అఘోర శివాచార్య్లుల వారి శిష్యరికంలో పాడిత్యం సంపాదించారు. వీరు రాజశేఖర చరిత్రం అనే కావ్యాన్ని రచించి తిమ్మనగారి అల్లుడైన నాదెండ్ల అప్పన్న మంత్రికి అంకిత మిచ్చారు. నలుసంత చిన్న కథను తీసుకొని పలు రకాల వర్ణనలు చేస్తూ కొండంత కావ్యాన్ని రాయడం మల్లన ప్రత్యేకత గా చెప్పవచ్చు. మల్లన వద్ద అంచి పాండిత్యం ఉంది. |