తన జీవితాన్ని పణంగా పెట్టి రోగాలపై జైత్రయాత్ర చేసిన శాస్త్రవేత్త లూయీపాశ్చర్ . పిచికుక్కకాటు వల్ల వచ్చే రాబిస్ వ్యాధిని నివారించే టీకా మందు కనుగొనడం, అంత్రాక్స్ వంటి మహమ్మారి రోగ నివారణ, పులియబెట్టడం, ద్రవాలలో కాంతి కుడి, ఎడమలుగా వక్రీభావించడం ఇత్యాది అనేక అంశాలు లూయీపాశ్చర్ పేరు వినగానే మనకు గుర్తుకు వస్తాయి. అంకిత భావంతో కూడిన నిరాడంబర శాస్త్రవేత్త లూయీపాశ్చర్ . మానవ జాతిని రోగాల బాధలేకుండా చేయాలని అహర్నిశలు కృషి చేసిన మహా మేధావి లూయీపాశ్చర్ . ఆ మహానీయుని సంగ్రహ చరిత్రే ఈ చిరు గ్రంధం. |