గురజాడ అప్పారావు గారి పేరును చాలా సార్లు వింటూ వుంటాం. వీరికి వైతాళికులు అంటారు. అనగా మేల్కొల్పే కవి అని అర్ధం. తెలుగు జాతి మూఢ విశ్వాసాలతో అర్ధం, పర్దం లేని ఆచారాలు, ఆనవాయితీలలో కొట్టు మిట్టాడుతున్న సమయంలో - తన కన్యాశుల్కం నాటకం ద్వారా కట్నాలు బాధ నుంచి రక్షించ గలిగారు. పూర్ణమ్మ కథ ద్వారా బాల్య వివాహాలు నిర్మూలించ గలిగారు. దేశం అంటే మట్టి కాదని మనుషులనీ చప్పారు. గురజాడ గేయాలు, నాటకం నేటికి బాగా ప్రచారంలో ఉన్నాయి. యువత మంచి మార్గంలో నడిచేందుకు తోడ్పడు తున్నాయి. ఆ మంచి మనిషి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. |