సిటీ సెక్యూరిటీ కన్సల్టెంట్స్‌... ఎనిమిది అంతస్థుల భవనం. ముందు కారు ఆపి నీరెండ వెలుగులో మిలమిలా మెరిసిపోతున్న ఆ నేమ్‌ బోర్డు వంక చూశాడు వాత్సవ.

అతనికి తెలియకుండానే పెదవులు మీదికి పరుగెత్తుకు వచ్చిందొక చిరునవ్వు. సిటీలోనే కాదు. దేశం మొత్తం మీద పాపులర్‌ అయిందా పేరు.

సంస్థను స్థాపించిన తొలినాళ్ళలో వారానికి ఇద్దరు లేక ముగ్గురు కస్టమర్స్‌ మాత్రమే కనిపించేవాళ్లు.

ఇప్పుడు? అపాయింట్‌మెంట్‌ తీసుకున్నా, ఒకటి రెండు వారాలు వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి క్రియేట్‌ అయిపోయింది. దేశ జనాభా పెరుగుతోంది. జనాభాతో పాటు సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి.

పిస్టల్‌ అంటే ఎలా వుంటుందో తెలియదు ఒకనాటి ప్రజలకు. అటువంటి వారికి ఇప్పుడు ఆర్‌.డి.ఎక్స్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ బాంబు పేలుళ్ళ గురించి అవగాహన వచ్చేసింది.

ఒంటికి ఆముదం వంటి ఆయల్‌ పూనుకుని, ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి బొగ్గుమసి వంటి నలుపు రంగు వేసుకుని, చప్పుడు కాకుండా గోడలకు కన్నాలు తవ్వి, దొంగతనాలు చేసే రోజులు ఎప్పుడో పోయాయి.

ఇంటి యజమాని మాదిరి సూటిగా ఇంట్లోకి వచ్చి, రివాల్వర్‌ చూపించి, యజమానుల కళ్ళ ముందే నిలువు దోపిడీ చేసే రోజులు వచ్చేశాయి.

ఎవరి ఒంటిమీదైనా చేయి వేయడానికి వందసార్లు ఆలోచించే పరిస్థితికి బదులు. మంచినీళ్ళు తాగినదానికంటే అతి తేలికగా ప్రాణాలు తీసే అలవాటు బలం పుంజుకుంది.

విషవృక్షం మాదిరి వికృతంగా ఎదిగిపోతున్న నేరప్రపంచం గురించి. దాని వికృత కార్యకలాపాల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని మధుబాబు రచించిన మరో క్రైమ్‌ థ్రిల్లర్‌ బొమ్మ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good