ఇది కథ కాదు. కల్పన కాదు. యథార్థ జీవితం. ఇందులో పాత్రలన్నీ నిజంగా వున్నవే. ఏదీ కల్పితం కాదు. అయితే అన్నీ నమూనా పాత్రలు. అంటే ఒక భూస్వామి వున్నాడనుకోండి- ఆ భూస్వామిని యథాతథంగా దించడం కాదు. భూస్వాములైన ఒకడి నుంచి కాలు, ఒకడి నుంచి చేయి, మరొకడి నుంచి తల, వేరొకడి నుంచి ఆత్మ- యిలా తీసుకుని వాళ్ల తాలూకూ పరిపూర్ణత్వాన్ని సాధించడమన్నమాట. కాబట్టి యిందులోని పాత్రలు, సంఘటనలు అన్నీ యిలా రూపు దిద్దుకున్నవే.
ఇది మానవ జీవన వాస్తవగాథ.
ఇది నా దేశ చరిత్ర. నా జాతి ప్రజల మూడున్నర దశాబ్దాల చరిత్ర. ఇందులో వేడివేడి దుఃఖాశ్రువులున్నాయి. చల్లటి ఆనందబాష్పాలున్నాయి. చరిత్రలోని ఈ కాలంలో పుట్టి పెరిగాను నేను. ఈ కాలంలో మన సమాజం ఎలా వున్నది? ఏ తీరున నడుస్తున్నది? ప్రస్తుత సామాజిక వ్యవస్థపట్ల మన వైఖరి ఏమిటో నిర్ణయించుకోవడానికి దాన్ని గురించిన ఖచ్చితమైన సమాచారం మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే తప్ప మనం సరియైన వైఖరిని తీసుకోలేము; సక్రమమైన నిర్ణయానికి రాలేము. అందుకోసమే ఈ పుస్తకం ఉద్దేశించబడింది.
Rs.210.00
In Stock
-
+