Rs.25.00
Out Of Stock
-
+
సకల జీవరాశులకూ, సమస్త మానవకోటికీ అడగకుండా అన్నం పెట్టే ఈ నేల నాదని కొందరు స్వార్థపరులు గిరిగీసుకొని, ముళ్ళకంచెలు వేసి, రాళ్ళుపాతి మిగిలిన వాళ్ళెవరూ ఈ నేల అందించే నీరు, నిప్పూ అన్నం ముట్టుకోకుండా కట్టడి చేస్తున్నారు. ఇది అన్యాయం అని అందరికీ కనబడుతున్నది. భూమి మీద దొరికే సంపద అంతా అందరూ పంచుకోవాలని, ఏది కూడా ఏ కొందరి చేతుల్లోనో ఇరుక్కుపోయి ఉండకూడదని, నేల అందిస్తున్న ఫలాలను అన్నీ అందరూ సమానంగా పంచు కోవాలనే పద్ధతి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రయత్నాలను గురించిన నేపథ్యమే ఈ పుస్తకం.