ధృఢమైన మంచి శరీర సౌష్టవాన్ని ఎవరు మాత్రం యిష్టపడరు? సమతుల ఆహారంతోపాటు శరీరానికి తగిన శ్రమ, వ్యాయామం లేనిదే శరీర సౌష్టవం పొందటం సాధ్యం కాదు. వ్యాయామం శరీర కండరాల బిగి సడలించి, కొత్త శక్తినిస్తుంది.

శరీరానికి శ్రమ కలిగించేది క్రమబద్ధంగా నిర్వహించేది యేదయినా వ్యాయామమే అవుతుంది. అయితే అన్ని ఎక్సర్‌సైజులలోకెల్లా నడక, పరుగెత్తడం, ఈతలను అందరూ చేయగల, అందరికీ ఉపకరించేవిగా చెబుతారు. వాకింగ్‌ను యధాలాపంగా కాక, వేగంగా నడవడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. అయితే మంచి శరీర సౌష్టవం కోరుకునేవారు, బాడీ బిల్డింగ్‌ చేస్తున్నవారు మామూలు ఎక్సర్‌సైజులతో పాటు శరీరంలోని వివిధ అంగాలకు, కండరాలకు ప్రత్యేకించిన ఎక్సర్‌సైజులను చేయవలసి వుంటుంది.

15-22 సం||ల మధ్య వయస్సు వారు ఎవరయినా బాడీ బిల్డింగ్‌ వ్యాయామాలు చేయవచ్చు. అయితే అంతకంటే ఎక్కువ వయసు గలవారు యీ వ్యాయామాలు చేయకూడదని కాదు. ఆ వయసులో శారీరక ఎదుగుదల పూర్తిస్థాయిలో జరుగుతుంది. కనుక ఫలితాలను త్వరితంగా పొందవచ్చు. అయితే మధ్య వయస్సు, అంతకు పైబడినవారు సైతం వ్యాయామాల ద్వారా తగిన సౌష్టవం పొంది ప్రపంచ రికార్డులను సృష్టించిన సందర్భాలు ఉన్నాయి....

Pages : 127

Write a review

Note: HTML is not translated!
Bad           Good