కానీ తన మనసులో మాట ఆమెతో ఎలా చెప్పడం?
''నాలుగు రోజుల పరిచయానికే ఏదో వూహించుకుంటే ఎలా?'' అన్నమాటే అతని చెవుల్లో మార్మోగుతోంది.
ఆమెకి తనంటే ఇష్టం. అందులో సందేహంలేదు. కానీ ప్రేమ ఉందో లేదో తనకి ఎలా తెలుస్తుంది?
తను తొందరపడి అడిగితే ఇష్టానికీ, ప్రేమకీ మధ్య తేడా తెలియని మూర్ఖుడని నిందిస్తే...!
అసలు తను మల్హరిని తప్ప వేరొకరిని తనకి జంటగా వూహించలేకపోతున్నాడే!
అలాంటిది ఆమె ఇంకొకరిని చేసుకుంటే తను భరించగలడా...? డబ్బుతో ఇంతవరకూ తను జీవితంలో అనుకున్నవన్నీ సాధించాడు. ఇపుడు మల్హరి మనసు దగ్గరకి వచ్చేసరికి ఇన్ని కోట్లూ ఎందుకూ పనికిరావు... మనసుని గెలవడనికి కావలసింది డబ్బుకాదు.
జీవితంలో ఇంతవరకూ ఎదుర్కున్న వింత సమస్యలన్నింటికీ డబ్బుద్వారానో, హోదా పలుకుబడి ద్వారానో ఎదుర్కున్నాడు.
ఇపుడు ఈ మలుపు జీవిత లక్ష్యాలనూ, ఆనందాలనూ తేల్చే మలుపు తనకి శ్వేత మీద ఎప్పుడూ ప్రేమ, చూడకుండా వుండలేకపోవడం లాంటి ఫీలింగ్స్ లేవు... ఆమె మనస్తత్వం కూడా తనని అంతగా ఆకర్షించదు. జీవితంలో మొదటిసారిగా తను ప్రేమించింది మల్హరినే!... ఏ అమ్మాయి మీదా ఇంతగా తనకి ఆసక్తి కలగదు. తను ఆమె మనసుని గెలిచి తీరాలి...
అందుకోసం తను ఏది కోల్పోయినా సరే!
తగిన సమయం సందర్భం తను చూసుకోవాలి... అంతే!

Write a review

Note: HTML is not translated!
Bad           Good