'బర్త్‌ వితౌట్‌ బర్త్‌డే' అనే ఈ పుస్తకం అన్ని ప్రముఖ పత్రికలలో ప్రచురించబడిన వ్యాసాల సంకలనం. ఈ వ్యాసాలు రెండు తెలుగు రాష్ట్రాలలోని మేధావి వర్గాన్ని ఒక కుదుపు కుదిపాయి. ఎందుకంటే తెలంగాణ వస్తే తమ ప్రాంత ప్రజలు సమస్యలన్నీ పరిష్కారమౌతాయని ఒకవైపు తెలంగాణా వాదులు, రాష్ట్రం విడిపోతే ఆంధ్ర, రాయలసీమ పూర్తిగా నష్టపోతాయని సమైక్యవాదులు కలహించుకుంటున్న రోజుల్లో ప్రొ|| ఐలయ్య అందరూ నివ్వెరపోయేలా మూడవ కోణాన్ని ఆవిష్కరించాడు. తెలంగాణ ఏర్పడితే నూతన రాష్ట్రంలో భూస్వామ్య వర్గాల ఆధిపత్యం తిరిగి నెలకొంటుందని, దాని పర్యావసానంగా దళిత, ఆదివాసి, బహుజన వర్గాలు అణచివేతకు గురవుతాయని ప్రొ|| ఐలయ్య సూత్రీకరించారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ వచ్చినప్పటికీ భూస్వామ్య అగ్రకులాల ఎత్తుగడలు విజయవంతమై అధికారంలోకి వచ్చేది ఫ్యూడల్‌ శక్తులని తెలంగాణ రాకముందే ఐలయ్య భవిష్య దర్శనం చేశారు. ఈ ఫ్యూడల్‌ శక్తులు తెలంగాణ శ్రమజీవుల్ని, రైతాంగాన్ని, విద్యార్థుల్ని మోసగించి ఈ ప్రాంతాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్ళటం ఖాయమని ఆయన ఆనాడే తేల్చి చెప్పారు. ఈ గ్రంథం దళిత, బహుజన ప్రజల భవిష్యత్తును దర్శింపజేస్తుందనటంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.

పేజీలు : 229

Write a review

Note: HTML is not translated!
Bad           Good