కన్నయ్య కుమార్‌ ఆత్మకథ

ఇది ఒక ప్రయాణం. ఇందులో ఒక యువకుడు తను పుట్టి పెరిగిన మారుమూల గ్రామం నుంచి దేశ రాజధాని వరకు ప్రయాణిస్తాడు. పేదరికంలో జీవిస్తూనే అతను ఒక ప్రతిఘటనా శక్తిగా ఎదుగుతాడు.

ఫిబ్రవరి 2016లో జె.ఎన్‌.యు. విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ రాజద్రోహ నేరంపై అరెస్టు అయి జైలుకి పంపబడతాడు. పాటియాలా హౌస్‌ కోర్టులో లాయర్లు అతన్ని కొట్టారు.

ఇలాంటి విషమ పరిస్థితుల్లో అతను ఒక యువరాజకీయ నాయకునిగా పుట్టుకొస్తాడు. ఇతని గురించి బిబిసి భారతదేశంలో అందరికంటే ఎక్కువగా అభిమానించబడిన, ద్వేషించబడిన వ్యక్తిగా, విద్యార్థిగా కీర్తించింది.

ఇది అతని కథ. బీహార్లఓ అతను పుట్టిన గ్రామంలో తను గడిపిన బాల్యం, పాట్నా కాలేజీ రోజుల నుండి ఢిల్లీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారే వరకు ఉన్న కథ.

ఈ కథను కన్నయ్య కుమార్‌ సజీవంగా అసాధారణమైన రీతిలో గాయపడిన హృదయంతో వినిపిస్తున్నాడు. అతని ఆలోచనలు నిర్భయంగా ఉంటాయి. నిలువెల్లా తిరుగుబాటు భావనలతో నిండి ఉంటాయి. బీహార్‌ నుంచి తీహార్‌ వరకు ఈ దేశంలో రాయబడిన అసాధారణమైన ఆత్మకథల్లో ఇది ఒకటి.

తన జీవనగాథని రాస్తూ కన్నయ్యకుమార్‌ గ్రామాల నుండి మారుమూల పల్లెల నుండి నగరబాట పడుతున్న యువత ఆకాంక్షలకి కలలకి ఆకారమౌతూ నినాదమౌతున్నాడు.

పేజీలు : 197

Write a review

Note: HTML is not translated!
Bad           Good