క్రిష్టోఫర్‌ కాడ్వెల్‌కి ముందు మహాతత్త్వవేత్తలయిన మార్క్స్ గానీ, ఏంగేల్స్  గానీ, లెనిన్‌ గానీ సాహిత్యం గురించి, ముఖ్యంగా కవిత్వం గురించి సకృత్‌గా ఆలోచనల్ని ప్రకటించినవారే గానీ సమగ్ర తాత్విక విశ్లేషణ జరపలేదు. మార్క్సీయమహాశాస్త్రంలోని ఆ లోటుని భర్తీ చేసేందుకే 1920 నుండి 1936 వరకు రాల్ఫ్‌ఫాక్స్‌, క్రిష్టోఫర్‌ కాడ్వెల్‌ వంటి మహనీయులు విశేష కృషి సల్పారు. రాల్ఫ్‌ఫాక్స్‌ నవలా సాహిత్యంపై తన దృష్టి కేంద్రీకరిస్తే, కాడ్వెల్‌ కవిత్త్వ తత్వశాస్త్రంలో అపార కృషి సల్పి అద్వితీయ గ్రంథమైన “Illusion and Reality”(భ్రాంతి - వాస్తవికత) ని మానవజాతికి సమర్పించాడు. ఇంతేగాక సమకాలీన మహారచయితల ఆలోచనా పథాలలో సంభవించిన వక్రతలనూ - న్యూనతలనూ సద్భావంతో ఎత్తిచూపి విమర్శించాడు. ఆ వ్యాసాలే రెండు భాగాలుగా మనకందుతున్న ‘Studies in A  Dying Culture’(నాశనోన్ముఖ సంస్కారంపై పరిశీలన). కాడ్వెల్‌ ప్రతిభ ఇక్కడితోనే ఆగకుండా భౌతికశాస్త్రం పైనా, ఏవియేషన్‌ పైనా కూడా ఆంగ్లంలో ఉద్గ్రంథాలు లేని లోటును చర్చించింది. అనేక అవిస్మరణీయ కవితలని కూడా అందించి సుస్థిర స్థానం సంపాదించాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good