భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో దాచేస్తే దాగని సత్యం. పదివేల మందికి పైగా బస్తర్‌ మూలవాసులు బ్రిటిష్‌ పెత్తనాన్ని ప్రతిఘటిస్తూ పోరాటంలో అమరులయిన సంఘటన. మరెన్నో వందల మందిపై రాజద్రోహం నేరం మోపి జీవిత ఖైదీలుగా జైళ్ళల్లో బంధించిన వైనం. చివరికి జైళ్ళల్లో స్థలం లేక ఇంకెదరినో కొరడాలతో కొట్టి కఠిన శిక్ష విధించి శారీరకంగా దుర్భరులను చేసిన సన్నివేశం. స్వాతంత్య్రోద్యమ ప్రభావానికి ముందే గ్రామీణ ప్రాంతాలలో ఆంగ్లేయుల పాలన పట్ల ఏహ్యభావంతో పెల్లుబికిన పోరాటతత్వానికి నిలువెత్తు సాక్ష్యం. మరఫిరంగుల, తుపాకి తూటాల ముందు ఆదివాసుల విల్లంబులు తుత్తినియలయినా మొక్కవోని ఆత్మస్థైర్యంతో బ్రిటిష్‌ అధికారులను నిలువరించిన బస్తర్‌ గిరిజనులు. సహచరుడు శతృవు పంచన చేని నిలువునా మోసం చేసి విప్లవయోధులను మత్తులో ముంచి మృత్యువు పాలు చేసినా తలవొగ్గకుండా అరణ్యాలలోకి నిష్క్రమించి చరిత్రలో పురాణ పరుషుడుగా మిగిలిపోయిన విప్లవవీరుఎడు గుండాధూర్‌. మట్టిలో కలిసిపోయిన మాణిక్యాలను వెలికి దీసి భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రకు కొత్త వెలుగులతో మెరుపులు దిద్దిన పుస్తకం ఇది.

పేజీలు : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good