'బావా! మూడుగంటల బస్‌లో నీ దగ్గరకసరి వస్తున్నాను...''
ఎక్స్‌ప్రెస్‌ డెలివరీలో అప్పుడే వచ్చిన ఇన్‌లాండ్‌ కవరు చదువుతూ విసుక్కుంటున్నాడు రామకృష్న. ఈ కోతి ఎప్పుడూ యింతే. ఏ విషయమూ వివరంగా రాయదు. ఏ రోజు వస్తున్నదో రాయకపోతే ఎలా? విసుక్కుంటూ, రెండు లైనుల వెడల్పున ఖాళీగావున్న లేత నీలం కాయితం చూస్తున్నాడు. అతని కళ్ళు మరికాస్త కిందకెళ్ళాయి.
''...అయిందా చిరాకుపడటం. నాకు తెలివిలేదనీ-చదువురాని మొద్దనీ అనుకుంటున్నావు కదూ, నేను రేపు అంటే, ఈ ఉత్తరం నీ చేతుల్లోకి వచ్చేనాటి మధ్యాహ్నాం - ఇక్కడ బయలుదేరి మూడున్నరకి మీ వూరు వస్తున్నాను. బస్‌స్టాండుకి తప్పకుండా రా. రాకపోతే సరాసరి కాలేజీకి వచ్చేస్తాను....

కక కన కక కదు కర్గ''
సంతకం చూసి, రామకృష్ణ ఫకాలున నవ్వాడు. తను పైకి నవ్వు తున్నానని, ఆ శబ్దం చుట్టూవారికి వినిపిస్తుందని రామకృష్ణకి తట్టలేదు. పకపక నవ్వాడు.
''ఎందుకోయ్‌ అంత నవ్వు'' అడిగాడు ఆ టైముకి పక్కనే వున్న శంకర్రావు.
''ఏంలేదు''.
''కారణంలేని నవ్వు వుండకూడదు. అది నాలుగురకాల చేటు. చెప్పు, ఇంతకీ అంత నవ్వు తెప్పించే...''
''కక కన కక కదు కర్గ'' అన్నాడు రామకృష్ణ మళ్ళీ పకపక నవ్వుతూ.
''అదేమిటి? ఏమన్నా భాషా?''
''ఆహా - భాషే. 'క' భాష. కనకదుర్గ.. అల్లా కక కన కక కదు కర్గ అయింది'' అన్నాడు మళ్ళీ నవ్వుతూ.
''అరే తమాషాగా వుందే. ఎట్లా మాట్లాడతారు? నాకు కూడా నేర్పు.''....

Write a review

Note: HTML is not translated!
Bad           Good