1901లో యిది ఇంగ్లీషులో ప్రచురితమైన వెంటనే న్యూయార్క్‌ ఈవెనింగ్‌ పోస్ట్‌ ''నిమ్నవర్గాల నుండి వచ్చిన మక్కీమ్‌ గోర్కీ అనబడే యువ రచయిత రాసిన అద్భుతమైన నవల ఫోమా గార్డియెవ్‌ రష్యన్‌ సాహిత్యంలో కలికితురాయి. రష్యన్‌ బూర్జువా వర్గపతనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపింది. అక్కడి సంపన్నులలో వచ్చిన తరాల అంతరాన్ని ప్రతిభా వంతంగా చిత్రించింది.'' అంటూ వ్యాఖ్యానించింది. తొమ్మిదవ ఏటనే అనాథగా మారిన గోర్కీ, జీవన పోరాట క్రమంలో రకరకాల కూలీ పనులు చేస్తూ రష్యా సామ్రాజ్యమంతటా అయిదేళ్ళపాటు కాలినడకన తిరిగి పేదరికమంటే కళ్ళారా చూశాడు. అనుభవించాడు. ఆయన నవలల్లోని సాధికారతకు కారణం యిదే. - ముక్తవరం పార్థసారధి

Write a review

Note: HTML is not translated!
Bad           Good