గుంటూరు జిల్లాలోని చర్లగుడిపాడులోని పద్మసాలెల కుటుంబంలో జన్మించిన దార్ల సుందరమ్మ తన 30వ ఏట అనగా క్రీ.శ.1829లో 'భావలింగ శతకము'ను వ్రాసినట్లుగా శతకంలో చెప్పబడింది. ఆమె తన అనుభవంలో 'సూటిగా జూచినట్టి' విషయాలను 'ఇంపుగా' నూట ఇరువది యొకటి ఆటవెలదులలో చెబితే ముక్తి గల్గుట సత్యమనే నమ్మకంతో శతకాని&్న వ్రాసినట్లు అర్థమవుతుంది.

వ్యక్తిగత నిష్టయైన 'ఆధ్యాత్మికతయే' సామూహిక సంస్కారానికి దారి తీయగలుగుతుందని ఈ శతక రచనవల్ల అర్థం అవుతుంది. జీవితంలో మాట, మనస్సుతో మోక్షమనే జ్ఞానమార్గాన్ని అన్వేషించటమే ఈ భావలింగ శతక విశిష్టతగా భావించవచ్చు.

తేటతెలుగులో లోతైన భావాలతో ఆటవెలదులలో అలవోకగా చెప్పిన ఈశతకం రచనా కాలనిర్ణయం ఖచ్చితంగా ఉన్న మహిళా శతకంగా చెప్పవచ్చు. మాటను మనస్సును ప్రక్షాళనచేసే శతకమిది. 'మాట' కున్న విలువను తెలియజేసే శతకం. 'మాట' యొక్క తాత్వికతను అర్థం అయ్యేటట్లు చేస్తుంది. భావాలు శాబ్దిక శక్తిగా మారటమే 'మాట'. అంటే భావం భౌతికత్త్వాన్ని పొందటం. ఈ విషయాన్ని 190 ఏళ్ళక్రితమే ఒక గ్రామీణ స్త్రీ శతక రూపంలో తెలియజేయటం తెలుగు జాతికి గర్వకారణం. వేమనతో సమానమైన లబ్ద ప్రతిష్టురాలు.

Pages : 39

Write a review

Note: HTML is not translated!
Bad           Good