సింహాసన్నాధిరోహించడానికి మొదటి మెట్టు మీద కుడికాలు పెట్టాడు భోజరాజు. అంతే ఆ సోపానం మీదున్న రత్నప్రతిమ మానవ స్వరంలో మాట్లాడసాగింది. 'భోజరాజా! ఈ సింహాసనం ఎక్కాలని కుతూహలంగా వచ్చావుకానీ, దీని నధిరోహించడం కాని, దీనిమీద కూర్చోవడానికి సామాన్యులకి సాధ్యంకాదు. సాహసం, వితరణ మొదలయిన గుణసంపదలకీ, ప్రపంచంలో అతి ప్రఖ్యాతిగాంచిన వాడూ అయిన విక్రమార్కుడి సింమౄసనమిది. దీనిని అధిరోహించడానికి అతనూ, అతనితో సమానులూ మాత్రమే అర్హులు. ఇది మానవులు నిర్మించింది కాదు. దేవేంద్రుడి చేత విక్రమార్కుడి కివ్వబడినది. అతను గడించాక యిది పూడ్చిబెట్టబడింది. నాలాగే యీ సింహాసనం మీదున్న ముప్ఫయి రెండు బొమ్మలూ మాట్లాడగలవు. బొమ్మలమైనా మేము మాట్లాడే శక్తి కలిగి ఉండటానికి కారణం లేకపోలేదు. నేనిప్పుడు చెప్పేదేమిటంటే- నాలుగు దిక్కుల చివర వరకూ కీర్తి వ్యాపించినవాడూ, అరవైనాలుగు కళలలోనూ ప్రవీణుడు, సాహసం, వితరణ మొదలైన సుగుణాలను సంపూర్తణంగా కలిగినవాడూ అయిన విక్రమార్కుడి లక్షణాలు నీకుంటే ఈ సింహాసనం ఎక్కు, లేదా వెళ్ళిపో, నా మాటలను కాదని ఎక్కబోయావో నీకు హాని కలుగుతుంది. ఆలోచించకుండా తొందరపడి ఏమీ చేయకూడదని గుర్తుంచుకో అంది.

భోజరాజుకి ఆ మాటలు వినడంతో కలిగిన ఆశ్చర్యం అంతాయింతాకాదు. సభలో ఉన్నవారూ అలాగే ఆశ్చర్యంలో మునిగిపోయారు. భోజరాజు ఆ ప్రతిమను చూస్తూ 'ఓ బొమ్మా! నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. విక్రమార్కుడని నువ్వు చెప్పావే, అతని చరిత్ర నేనెరగను. అతగి గుణాలవంటివి నాలో ఉన్నాయో లేదో నువ్వే నిర్ణయించాలి. నువ్వు సమర్ధురాలి వనిపిస్తుంది. విక్రమార్కుడి చరిత్ర చెప్పు, 'అన్నాడు. అందుకా ప్రతిమ 'రాజా'! విక్రమార్కుడి గుణగుణాలు వర్ణించడం నాతరం కాదు. అయినా నా శక్తిమేరకు చెబుతాను' అంటూ చెప్పసాగింది - దాన్నే మనకు ఈ పుస్తకంలో శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రంగారు చెప్పారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good