హైదరాబాద్‌ నగర జీవితానికి సంబంధించినంత మేరకు ఈ నవలలు ఒక డాక్యుమెంటరీ. ప్రస్తుతం ఆధునికత ఆవరించి మెట్రో రైలు పేరిట నగరాన్ని దిగమింగుతున్నాయి. చారిత్రక కట్టడాలు కనుమరుగవుతున్నాయి. సుల్తాన్‌బజార్‌ లాంటి నవలల్లో పేర్కొన్న ప్రదేశాలు రూపుమారనున్నాయి. కోఠి ఉమెన్స్‌ కాలేజి కళావిహీనం కానుంది. వందల యేండ్లుగా సజీవ సంఘటనలకు సాక్ష్యాలుగా నిలిచిన ప్రదేశాలు మూగగా రోదిస్తూ రూపుమార్చుకుంటున్నాయి. తరగిపోతున్న, నాశనం అవుతున్న ఒక చారిత్రక వారసత్వాన్ని ఈ నవలలు దివిటీపట్టి ఆకాశమెత్తు ఎత్తి చూపించాయి. ఇట్లాంటి నగరంపై, నగర చరిత్రపట్ల, సంస్క ృతి పట్ల ఎలాంటి పట్టింపులేని పాలకులు, ప్రతిపక్షాలు ఒకేరీతిలో 'బుల్‌డోజ్‌' చెయ్యడమే పనిగా పెట్టుకున్నాయి.
'బుల్‌డోజ్‌'కు గురవుతున్న చరిత్ర, సంస్క ృతిని సాహిత్యాన్ని కాపాడుకునేందుకు కొత్తతరం నడుంకట్టేందుకు ఈ నవలలు స్ఫూర్తి కావాలి. ఈ స్ఫూర్తిని ఆవాహన చేసుకోవాలని ఆహ్వానిస్తూ...      - సంగిశెట్టి శ్రీనివాస్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good