తెలుగు సాహిత్య సమాజంలో ప్రచారంలో వున్న నీతిశతకాలలో భాస్కరశతకము కూడా చాలా ప్రసిద్ధి చెందిన శతకమే. చిరకాలంగా తెలుగు పాఠకులు ఆదరిస్తున్న శతకమిది. ప్రఖ్యాతమైన ఈ భాస్కరశతకము రచించిన కవి మారన వెంకయ్య.

ప్రత్యక్షనీతి బోధకంటే దృష్టాంతపూర్వకమైన నీతిబోధ గొప్ప ప్రభావాన్ని చూపుతుందని నమ్మిన ఈ కవి ప్రతి పద్యంలోను ఒకటి రెండు పాదాలలో ఒక సత్యాన్ని ప్రకటిస్తాడు. తరువాతి పాదాలలో దానిని సమర్థించడానికి ఒక దృష్టాంతం చెపుతాడు. ఆ దృష్టాంతాలను రామాయణ భారతాలనుండేకాక వివిధ పురాణాలనుండి కూడా స్వీకరిస్తా, సజ్జన దుర్జన లక్షణాలు, పరోపకార గుణం, స్వార్థరాహిత్యం, మానవుల రకరకాల మనస్తత్వాలు సార్వకాలిక సత్యాలుగా పాఠకుల ముందుంచుతాడీకవి. కఠిన పదాలు లేని ధారాళమైన శైలితో మనస్సుకు హత్కుఉనే నీతిబోధనా విధానం కన్పిస్తుందీ పద్యాలలో. గొప్ప శతక కవుల పద్యాల క్రింద సరళ భావాన్ని పొందుపరచి సామాన్య పాఠకులకు, యువతరానికి, ముఖ్యంగా విద్యార్థులకు అందించాలన్నది మా ఆకాంక్ష.

పేజీలు : 40

Write a review

Note: HTML is not translated!
Bad           Good