ప్రాచీన తెలుగు శతకాలలో ఒక్క సుమతీ శతకం తప్ప మిగిలినవి వేనిలో లేని ప్రత్యేకత ఈ శతకంలో ఉన్నది. ఇందులోని పద్యాలన్నీ అకారాది క్రమంలో ఉన్నాయి. ఆరుద్ర ఈ ఏర్పాటు బహుశ: బ్రౌన్‌ దొర చేయించాడేమో అని భావించారు. కవుల హృదయ క్షేత్రాలలో నీతిని ఉపదేశించాలనే ఆకాంక్ష, వారిలోని ఉపదేశపటిమ నీతి శతకాలను కూర్చేటట్లు చేస్తుంది. ఈ భాస్కర శతకంలోని రచనలో ఉక ఉత్కృష్టత ఉన్నది. ఇందులో ముందుగా ఒక విషయం చెప్పబడి దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతం ఇవ్వబడింది. తెలుగులో వెలసిన దృష్టాంత శతకాలలో భాస్కర శతక విశిష్టత ఉత్కృష్టమైనదని పండితుల తలంపు. దృష్టాంతాలుగా ప్రతిపద్యంలోను తెలియచెప్పాలంటే కవికి లోక వృత్తాంత జ్ఞానము సుష్టుగా తెలిసి ఉండాలి. కావ్య పురాణ ఇతిహాస జ్ఞానం మెండుగా ఉండి సమయజ్ఞత ఉండాలి. ఎందుకంటే దృష్టాంతాలు అదరికీ తెలిసినవి, వెంటనే అవగాహనకు వచ్చేవి కావటం చాలా ముఖ్యం. ఇలాంటి ఉత్తమ దృష్టాంతాలను కూర్చిన ఈ కవి గొప్ప కవితా సామర్థ్యం ఉన్నవాడు. ఈ శతకంలో మొత్తం 109 పద్యాలున్నాయి.

పేజీలు : 74

Write a review

Note: HTML is not translated!
Bad           Good