భార్య, భర్త, మరొకరు. పేరుని బట్టే ఈ సంపుటిలోని కథలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. 'అక్రమ సంబంధం తల్పంలో జరిగే ముందు తలలో జరుగుతుంది' అని ఈ కథలు తెలియజేస్తాయి.

'అక్రమ సంబంధం నేరం కాదు. మోసం కాదు. వినోదం' అనే నమ్మకం గల పాత్రలతో సాగే ఈ కథలన్నీ వివిధ అమెరికన్‌ పత్రికల్లోంచి మల్లాది వెంకటకృష్ణమూర్తి ఎంపిక చేసి అనువదించినవి. 'అక్రమ సంబంధం మనలోకి నడిచి వస్తే, తన వెంట కర్కశత్వాన్ని తెచ్చి అది అన్నిటినీ బయటకి పంపుతుంది' అని కూడా ఈ కథల్లోని పాత్రల ప్రవర్తన ఋజువు చేస్తుంది. 'అక్రమ సంబంధం అంటే రతికి ప్రజాస్వామ్యాన్ని కలపడమే' అని భావించే పాత్రలతో, ఎదురు చూడని చక్కటి మలుపులతో, ఉత్కంఠగా చదివించే ఈ కథలన్నీ ప్రేమ కథలు, క్రైమ్‌ కథలు.

పేజీలు : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good