లక్ష్మణకవి తాను సుభాషిత రత్నావళి అనే చాటు ప్రబంధాన్ని పెద్దాడ సోమశంకర దేవుని ప్రేరణతో ఆ దేవదేవునికి అంకితంగా రచించినట్లుగా ఆ కావ్యపు అవతారికా పద్యాలలో తెలియజేశాడు. ఈ కవి పద్దెనిమిదవ శతాబ్దం ఉత్తరార్థంలో కవి సార్వభౌముడని పేరు పొందిన కూచిమంచి తిమ్మకవికి సమకాలికుడు కావటం చేత పద్దాపురం పాలకుడు శ్రీవత్సవాయ తిమ్మజగపతికి ఆశ్రితుడు అయినందున ఆ తిమ్మగజపతి క్రీ.శ. 1797లో మరణించినట్లు తెలుస్తున్నందు వలన ఈ కవి పద్దెనిమిదవ శతాబ్దం ఉత్తరార్థకాలానికి చెందిన వానిగా చెప్పవచ్చును.

ఈ కవి సుభాషిత రత్నావళిని యధామూలంగా, మనోహరంగా, ప్రౌఢశైలిలో సందర్భోచిత సముచితశైలిలో, మూలకవి హృదయాన్ని అర్థం చేసికొని రచించాడని విమర్శకుల అభిప్రాయం. ఈ సుభాషిత త్రిశతిలోని అనేక పద్యాలు పండితులను పామరులను కూడా ఆకర్షించడం చేత విస్తృత ప్రచారం కలిగింది. లక్ష్మణ కవి రచించిన ఇతర గ్రంథాల కంటే సుభాషిత త్రిశతి ప్రఖ్యాతి పొందింది.

పేజీలు : 88

Write a review

Note: HTML is not translated!
Bad           Good